A living archive of the life, cinema and vision of Nandamuri Taraka Rama Rao. Explore the archive →

← Back to the Journal

The Journal

ఎన్ టీ ఆర్ 220 గురుకులాల స్థాపనతో విద్యా విప్లవం!

2 min read
ఎన్ టీ ఆర్ 220 గురుకులాల స్థాపనతో విద్యా విప్లవం!

వెండితెర ఇల వేలుపుగా,రాజకీయ యవనికపై సింహ గర్జనగా నిలిచిన ఎన్ టి ఆర్ కేవలం అధికారం కోసం రాజకీయం చేయలేదు.రాబోయే తరాల భవిష్యత్తు కోసం పునాదులు వేశారు.ఎన్ టి ఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీచ్చారు.ఎన్టీఆర్ ఏ పథకం మొదలు పెట్టినా అందులో ఒక విప్లవం ఉంటుంది.ఆ విప్లవానికి ప్రతిరూపమే గురుకుల విద్యా వ్యవస్థ.ఒకే ఒక్క సంతకంతో 220 గురుకులాలను ఏర్పాటు చేసిన ఘనత ఎన్ టి ఆర్ దే.మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఆయన గురుకుల విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. గురుకుల విద్యా వ్యవస్థ ఏర్పాటు ఒక విప్లవాత్మక అడుగు.భారతదేశ విద్యా చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత ఎన్.టి.ఆర్ దే. సామాన్యుడికి కూడా కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించాలనే సదుద్దేశంతో కుల, మత, ఆర్థిక వ్యత్యాసాలు లేకుండా కేవలం ప్రతిభ ఆధారంగా పేద విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యను అందించడం ప్రధాన లక్ష్యం.

పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని, అట్టడుగు వర్గాల బిడ్డలు కూడా కలెక్టర్లు, డాక్టర్లు కావాలని ఆయన ఆలోచనలే నేడు మన ముందున్న గురుకుల పాఠశాలలు.ఆనాడు సమాజంలో సంపన్న వర్గాలకే పరిమితమైన నాణ్యమైన విద్యను, నిరుపేద దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల ముంగిటకు చేర్చిన మహనీయుడు ఎన్టీఆర్. ఒకేసారి వందల సంఖ్యలో గురుకులాలను ఏర్పాటు చేయడం అనేది అప్పట్లో ఒక సంచలనం. ఆనాడు ఆయన నాటిన విత్తనాలే నేడు మహావృక్షాలై లక్షలాది మందికి జ్ఞానఫలాలను అందిస్తున్నాయి నేడు రెండు తెలుగురాష్ట్రాల్లో. కులమతాలకు అతీతంగా,ప్రతి పేద విద్యార్థికి కార్పొరేట్ స్థాయి వసతులతో కూడిన విద్యను అందిస్తున్నాయి. కేవలం చదువు మాత్రమే కాదు. భోజనం, వసతి, బట్టలు అన్నీ ప్రభుత్వమే భరించేలా ప్రణాళిక చేశారు.పెన్సిల్ నుంచి పెన్ను వరకు పేద విద్యార్థి చేతికి ఎన్ టీ ఆర్ అందించారు. ఉత్తమ ఉపాధ్యాయులను నియమించి, క్రమశిక్షణతో కూడిన విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు.పేదల కడుపు నింపడం ఎంత ముఖ్యమో,వారి తలరాతను మార్చే చదువుని ఇవ్వడం అంతే ముఖ్యం అని నమ్మిన నాయకుడు ఎన్ టి ఆర్. 2 రూపాయల కిలో బియ్యం పథకంతో ఆకలిని తీర్చిన ఆయన గురుకుల పాఠశాలల ద్వారా ఆ నిరుపేద కుటుంబాల్లో విద్యా దీపాలను వెలిగించారు.నేడు అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు వారు ఈ స్థాయికి రావడానికి కారణం ఆనాడు ఎన్టీఆర్ స్థాపించిన గురుకులాలే అని గర్వంగా చెప్పవచ్చు. అక్షరమే ఆయుధంగా ఆయన ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు తెలుగు రాష్ట్రాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ దగ్గది.ఎన్టీఆర్ పేద విద్యార్థుల కళ్లలో మెరిసే జ్ఞాన జ్యోతి . ఆయన నిర్మించిన ఈ విద్యాలయాలు కేవలం భవనాలు కావు. అవి తెలుగు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా కర్మాగారాలు.

పేదవాడి ఇంట్లో అక్షర దీపం వెలిగితే, ఆ వెలుగు ఆ కుటుంబం తలరాతనే మారుస్తుంది. చదువు అనేది కేవలం ధనవంతుల బిడ్డల సొత్తు కాకూడదని, అడవి బిడ్డలు, అణగారిన వర్గాల పిల్లలు కూడా ప్రపంచంతో పోటీ పడాలని కలలు గన్న మహా నాయకుడు ఎన్ టి ఆర్. ఆయన గుండెల్లో నుంచి పుట్టిన అక్షర యజ్ఞమే గురుకుల పాఠశాలలు.అవి భావి భారత పౌరులను తీర్చిదిద్దిన దేవాలయాలు అని చెప్పాలి. నేడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన ఎంతోమంది మేధావుల మూలాలు వెతికితే అవి ఎన్ టీ ఆర్ వేసిన గురుకుల పునాదుల వద్దే కనిపిస్తాయి.రాజకీయ సిఫార్సులకు తావులేకుండా, ప్రవేశ పరీక్ష ద్వారా అత్యంత పారదర్శకంగా అడ్మిషన్లు నిర్వహించే పద్ధతిని అమలు చేశారు. ఈ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు తర్వాతి కాలంలో సివిల్ సర్వెంట్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా దేశ విదేశాల్లో స్థిరపడటం ఈ వ్యవస్థ విజయానికి నిదర్శనం.గురుకుల విద్యా వ్యవస్థ ఏర్పాటు చెసి భారతదేశ విద్యా చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత ఎన్.టి.ఆర్ దే

Nandamuri Taraka Rama Rao

A Legacy That Lives Forever