A living archive of the life, cinema and vision of Nandamuri Taraka Rama Rao. Explore the archive →

← Back to the Journal

The Journal

ఎన్టీఆర్ vs అప్పటి రాజకీయ వ్యవస్థ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విప్లవం

Tulasi Padmasree1 min read

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు రాజకీయాలు అంటే ఒకే పార్టీ ఆధిపత్యం, ఒకే విధమైన పాలన అనే భావన ఉండేది. ప్రభుత్వాలు మారినా వ్యవస్థ మాత్రం పెద్దగా మారేది కాదు. ప్రజలు ప్రభుత్వాన్ని దూరంగా ఉన్న శక్తిగా చూస్తూ ఉండేవారు.

ఎన్టీఆర్ vs అప్పటి రాజకీయ వ్యవస్థ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విప్లవం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు రాజకీయాలు అంటే ఒకే పార్టీ ఆధిపత్యం, ఒకే విధమైన పాలన అనే భావన ఉండేది. ప్రభుత్వాలు మారినా వ్యవస్థ మాత్రం పెద్దగా మారేది కాదు. ప్రజలు ప్రభుత్వాన్ని దూరంగా ఉన్న శక్తిగా చూస్తూ ఉండేవారు.

అలాంటి సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి N. T. Rama Rao. ఆయన రాజకీయాల్లోకి రావడం ఒక సాధారణ రాజకీయ ఎంట్రీ కాదు. అది అప్పటి రాజకీయ వ్యవస్థకు ఒక సవాలు.

1982లో ఆయన పార్టీ స్థాపించినప్పుడు చాలామంది ఇది సాధ్యమా అని అనుకున్నారు. ఎందుకంటే అప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో ఒకే పార్టీ బలంగా ఉండేది. కానీ ఎన్టీఆర్ ప్రజలతో నేరుగా మాట్లాడే మార్గాన్ని ఎంచుకున్నారు. గ్రామాలు, పట్టణాలు తిరుగుతూ ప్రజల సమస్యలు విన్నారు.

ఆయన ప్రచారంలో ఉపయోగించిన “చైతన్య రథం” అప్పట్లో ఒక పెద్ద మార్పు. రాజకీయ నాయకులు ప్రజల దగ్గరకు వెళ్లే విధానాన్ని అది కొత్తగా పరిచయం చేసింది. ప్రజలతో నేరుగా మాట్లాడటం, వారి సమస్యలను వినడం అనే రాజకీయ శైలి అక్కడి నుంచే బలపడింది.

అప్పటి రాజకీయ వ్యవస్థలో నాయకత్వం ఎక్కువగా పార్టీల ఆధీనంలో ఉండేది. కానీ ఎన్టీఆర్ రాజకీయాల్లో వ్యక్తిత్వం, నాయకత్వం ఎంత ముఖ్యమో చూపించారు. ఆయన ప్రచారం ఒక పార్టీ ప్రచారం మాత్రమే కాదు ప్రజల ఆత్మగౌరవం గురించి
మాట్లాడే ఉద్యమంగా మారింది.

ప్రత్యేకంగా “తెలుగు వారి ఆత్మగౌరవం” అనే భావన ప్రజల్లో బలంగా మారింది. రాజకీయాలు కేవలం అధికార పోరాటం కాదు, ఒక సమాజ గౌరవం కూడా కాపాడాలి అనే ఆలోచనను ఆయన ముందుకు తెచ్చారు.

అందుకే 1983 ఎన్నికల్లో జరిగిన ఫలితం సాధారణ రాజకీయ విజయం కాదు. అది అప్పటి రాజకీయ వ్యవస్థపై ప్రజలు ఇచ్చిన ఒక బలమైన సమాధానం. చాలా తక్కువ సమయంలో ఒక కొత్త పార్టీ అధికారంలోకి రావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చారిత్రక సంఘటనగా నిలిచింది.

ఎన్టీఆర్ నాయకత్వం అప్పటి రాజకీయ వ్యవస్థకు ఒక ప్రత్యామ్నాయం చూపించింది. ప్రజలతో నేరుగా కనెక్ట్ అయ్యే నాయకత్వం, వేగంగా నిర్ణయాలు తీసుకునే ధైర్యం, సంక్షేమంపై దృష్టి ఇవన్నీ కలిసి కొత్త రాజకీయ సంస్కృతికి దారి తీశాయి.

ఈ రోజుల్లో కూడా ఒక ప్రశ్న తరచూ వినిపిస్తుంది
“ఎన్టీఆర్ వచ్చినప్పుడు జరిగిన ఆ రాజకీయ మార్పు మళ్లీ సాధ్యమా?”

చరిత్రను తిరిగి రాయడం సులభం కాదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అది కేవలం ఒక నాయకుడి విజయం కాదు అప్పటి రాజకీయ వ్యవస్థపై జరిగిన ఒక విప్లవం.

రచయిత గురించి:
తులసి పద్మశ్రీ
మార్పు వెల్ఫేర్ సొసైటీ స్థాపకురాలు ,మరియు రచయిత్రి. సమాజంలో మార్పు, ప్రజా విధానాలు, గ్రామీణ అభివృద్ధి మరియు సామాజిక అంశాలపై ఆమె రచనలు చేస్తుంటారు.

Nandamuri Taraka Rama Rao

A Legacy That Lives Forever